భారతదేశ మహిళా ఉద్యమాన్ని ఎన్ని దశలుగా చూడవచ్చు? 1857 లో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం మొదలైనప్పటినుండీ 1947 వరకు జరిగిన బ్రిటిష్ వ్యతిరేక పోరాటాల్లోనూ “స్వాతంత్రోద్యమంలోనూ” మహిళల భాగస్వామ్యం చెప్పుకోదగినవిధంగా ఉంది. ప్రత్యేక మహిళాఉద్యమంగా రూపొందకపోయినా ఆ పోరాటాల్లో పాల్గొనడం ద్వారా వారు పితృస్వామ్యాన్ని ఢీకొన్నారు. వారి భాగస్వామ్యం అర్జీలు, విన్నపాలు సమర్పించడం దగ్గర నుండి, ఊరేగింపులూ పికెటింగ్ లు, ధర్నాలు, నిరాహారదీక్షలు, స్వచ్ఛంద అరెస్టులు తదితర రూపాల్లో కొనసాగడమే కాకుండా జాతీయ విప్లవకారులుగా సాయుధచర్యల వరకూ అన్నిటిలో పాల్గొన్నారు. 1917 నుండే అఖిల భారత స్థాయిలో మహిళా సంఘాలు ఏర్పడినప్పటికీ అవి స్వాతంత్ర పోరాటంలోనూ కొంత