ఆదివాసులపై వైమానిక దాడులకు వ్యతిరేకంగా హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్ హాల్లో ఉదయం 11 గంటలకు బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదుల సమావేశాన్ని పాణి ఆరంభించారు - తెలంగాణ ప్రజల గురించి, తెలుగు ప్రజల గురించి, ఆదివాసుల హక్కుల గురించి దశాబ్దాలుగా పనిచేస్తున్న బుద్ధిజీవులు, ప్రజాస్వామ్యవాదులు ఈ సమావేశానికి వచ్చారు. 1948లో హైదరాబాదు రాష్ట్రంపై నెహ్రూ, పటేల్ పోలీసు చర్య దగ్గరి నుంచి దండకారణ్యంలో సైనిక చర్యలు దాకా మన ప్రజాస్వామ్యం విస్తరించింది. నేల మీద లక్షల సైన్యం ఆదివాసీ ప్రజలపై యుద్ధానికి తలపడిన దశ నుంచి సరిహద్దు దేశాల యుద్ధాల్లో వాడే హెలికాప్టర్లలో సైనికులు వచ్చి బాంబు దాడులు