కాలమ్స్ సమకాలీనం

టిప్పుసుల్తాన్ పై హిందూత్వ దాడి

గత జూన్ నెలలో కడప జిల్లా పొద్దుటూర్ పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా మొదలు పెట్టిన తొలి దశ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అడ్డుకున్నది. ఇది కేవలం ముస్లింలను సంతృప్తి పరచడానికి ఉద్దేశించిన కార్యక్రమంగా ఆ పార్టీ పేర్కొన్నది. టిప్పు సుల్తాన్ హిందూ మత ద్వేషి అని, హిoదువులను ఊచకోత కోయించిన హంతకుడు, హిందు స్త్రీల పైన అత్యాచారాలు జరిపించిన దుర్మార్గుడు, అతనొక ఉన్మాది అని అసలు ఈ దేశ వాస్తవ్యుడే కాదనేది బీజేపీ వాదన. అలాంటి చారిత్రక చెడ్డ పురుషుని విగ్రహం నెలకొల్పడం జాతీయ స్ఫూర్తికి విరుద్ధమని వాదిస్తున్నది. నిజానికి బీజేపీ