రాయలసీమ సమాజం ఆశలను, ఆకాంక్షలను సభ్య సమాజం ముందుంచడానికి రాయలసీమ సాగునీటి సాధన సమతి, రాయలసీమ ప్రజా సంఘాలు అనేక కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాల సారాంశాలను విస్తృతంగా సమాజం ముందుంచడంలో, వారికీ అవగాహన కల్గించడంలో, చైతన్యం కల్గించడంలో పత్రికా రంగం ప్రధాన పాత్ర వహించాల్సివుంది. అణగారిన, నిర్లక్ష్యానికి గురైన, వెనుబడిన ప్రాంతాల సమస్యలతో పాటు వాటికీ నిర్దిష్ట పరిష్కార మార్గాలను రాజకీయ వ్యవస్థకు ముందుంచడంలో కుడా పత్రికా రంగం బాధ్యతాయుత పాత్ర వహించాల్సివుంది. ఆ దిశగా “వసంతమేఘం’ సంపాదకులు, నిర్వహకులు క్రియాశీలకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికీ ముందుగా అభినందనలు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోస్తా