కవిత్వం

మణిపూర్ ఒక్కటే! సీతలే అనేకం

మలయ మారుతాలెక్కడివి దేశం నిండా ముళ్ల కంచలే పచ్చని పంటలాంటి పైటలెక్కడివి రథచక్రాలు నడిచిన దారిలో చితికిన అంగాంగాల ప్రదర్శన సాగుతూనే వున్నది నా శరీరానికి రంగేమిటని నన్నడగబోకు ఏ జాతికి చెందినదాన్నో నన్నడగబోకు సిరి సంపదలున్న దేశంలో సీకులు దిగిన దేహం నాది గంగా నదిలో పారుతున్నది ఏమిటని ఇంకా నన్ను అడగబోకు సరస్వతీ దేవిని చావబాదిన చరిత్ర నీది లక్ష్మీదేవిని నగ్నంగా ఊరేగించిన ఘనత నీది పార్వతీ దేవిని చెరిచిన మేధస్సు నీది తిరంగ జెండాను చీల్చడానికి త్రిశూలాలను తయారు చేసిన చెడ్డీ నీది నీ పార్టీ హిట్లర్ పార్టీని ఎప్పుడో మించిపోయింది ఫాసిజంలో ఫస్టు