కవిత్వం

మందరపు హైమావతి రెండు కవితలు

1 గెలుపు గుర్రాలం ఇక వెనకడుగులన్నీ ముందడుగులే కుంటి గుర్రాలన్నీ పరిగెత్తే పారశీక జవనాశ్వాలే పాత చరిత్రలు పాత కథలన్నీ పాదమట్టం బండరాళ్లకు రెక్కలు మొలిచిన అద్భుతం అటు అగ్రకులాల ఆధిపత్య భావనల పావురాలనెగరయ్యలేక కింది కులాల ధిక్కారస్వరంతో గొంతు కలపలేక ఆత్మన్యూనతాభావంతో ముడుచుకుపోయే అత్తిపత్తులం స్వేచ్ఛ సీతాకోకచిలుక రెక్కలు విరిచి కాళ్లకు బదులు మనసుకు సంకెళ్లు వేసి అమానవీయ అంటరానితనం కొరడా దెబ్బలు వెలివాడల బహిష్కరణల బహుమతులు మాత్రమే తక్కువ తరతరాలుగా చాకలోళ్లు మంగలోళ్లు కుమ్మరోళ్లు కంసాలోళ్ళు అంటూ మా మనసు పుస్తకాలపై చెరగని అవహేళనల రాతలు 'పిల్లలకు పట్టింపులేమిట' ని వసారాలోవడ్డించి ఎంగిలాకులు ఎత్తించిన కటిక