వ్యాసాలు

మోహన్ జీ అజరామర జ్ఞాపకాలు

కామ్రేడ్‌ ఆనంద్‌ నాకు మొదటిసారి ఓ సమావేశంలో  పరిచయం. ఆ రోజుల్లో సత్యమూర్తి విప్లవోద్యమంలో   సృష్టించిన మొదటి సంక్షోభం  పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్లీనానికి హాజరయ్యాం. కరీంనగర్‌ నుండి నేను, మరికొందరు అదిలాబాద్‌ నుండి కామ్రేడ్‌ ఆనంద్‌తో పాటు మరికొందరు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల నుండి  మరికొందరు  హాజరయ్యారు. ఆ రోజు ఉత్తర తెలంగాణ విప్లవోద్యమంపై ఎన్‌.టి.ఆర్‌. ప్రభుత్వం తీసుకవచ్చిన తీవ్ర నిర్బంధం, వరుస ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. అలాంటి  సమయంలో   సంక్షోభం రావడం చాలా బాధాకరం. యావత్‌ విప్లవోద్యమానికి  ఇది మొదటి సంక్షోభం కావడంతో ఆ సమావేశంలో   ఒక విధమైన ఆందోళనకర వాతావరణం నెలకొన్నది. కొందరు ప్రతినిధులు