కోబాద్ గాంధీ తన జైలు డైరీకి నా ప్రతిస్పందనను చదివి స్పందించడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. కొన్ని ఉద్యమ ప్రాథమిక సమస్యలపైన ఇది మంచి చర్చకు దారితీస్తుందనే ఆయన అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఆయన లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు స్పందించడానికి ప్రయత్నిస్తాను. జార్ఖండ్ ఉద్యమం సమస్యపై నేను తనని తప్పుగా ఉదహరించానని కోబాడ్ గాంధీ అంటున్నారు. వాస్తవానికి, నేను ఈ అంశంపై అసలు ఉదహరించదమనేదే జరగనప్పుడు, తప్పుగా ఉదహరించాననే ప్రశ్న ఎక్కడనుంచి వస్తుంది? ఆ డైరీ మీద నాకు ఏర్పడిన అభిప్రాయాలను చెప్పాను అంతే. కానీ ఇప్పుడు అతను రాసిన ఇతర విషయాలకు సమాధానం చెప్పే