కవిత్వం

నాలుగు పిట్టలు

వస్తూ వస్తూ నీ ఇంటి బయట ఓ చెట్టు నాటి వచ్చాను నాది కాకపోయినా ఏదో ఒక నీడ నీకుండాలని * పని నీ కోసమే చేస్తున్న వాడిని పనిలోపడి నన్ను మరిచిపోకు అంటావు ** బతుకు తరిమితే వలస వచ్చాను ప్రేమ పిలిస్తే తిరిగి వెళ్ళిపోతాను * చెమట చుక్క నుదుటి నుండి టప్పున జారిపడినప్పుడంతా నీ గుండె ముక్కలైందేమో అని భయపడతాను * ఎలా నిజం అవుతాయి స్వప్నాలు దిండు కింద పడి నలిగిపోతుంటే * పర్లేదు ఖాళిగానే ముగిసిపోని రాత్రుళ్ళు నీ ఇంటిపని తగ్గిపోయే వరకూ * అందం గురించి దిగులుపడకు నీ లావణ్యం
సమీక్షలు

లోపలి, బైటి ఘర్షణల్లో ‘శికారి’

‘శికారి’నవలలోని కథ జీవితానికి సంబంధించిన ఒక ప్రవాహం. ఆ ప్రవాహం కెసి కెనాల్‌ అనే జల ప్రవాహం ఒడ్డున పెనవేసుకున్న  శికారీల జీవితం.  ఈ జీవన ప్రవాహం ఒక భార్యాభర్తల గొడవతో మొదలౌతుంది..అక్కడ నుండి  శికారిల లోపలి, బైటి వైరుధ్యాల మీదుగా  అలా కొనసాగుతుంది.  చివరికి ఒక ఉత్సవంతో ముగుస్తుంది. ఈ ఆశ నిరాశల జీవన గమ్యం-గమనం ఏమిటి? నిత్యం మారే రాజకీయార్థిక పరిస్థితులు జీవితాన్ని స్థిమితంగా ఒక చోట ఉండనిస్తాయా?  ఆ కదలిక ఈ కథలో ఉంది. చుట్టూ మారుతున్న రాజకీయార్థిక పరిస్థితులు శికారీలను కూడా ప్రభావితం చేస్తాయి. కథనంలో శికారీ పాత్రలు వస్తూ ఉంటాయి. జీవన