కాలమ్స్ కవి నడిచిన దారి

నా కవిత్వం ఒక నినాదం

నా కవితా ప్రస్థానం వలసలో మొదలైంది. అప్పటి వరకూ అంటే 1993 నాటకి నా ఇరవై మూడేళ్ళ జీవితంలో సీరియస్ సాహిత్యం తో పరిచయం తక్కువ. కొంత శ్రీశ్రీ, కొంత తిలక్, కొంత ఠాగూర్ గీతాంజలి తప్ప కవిత్వం అంటే సినిమా సాహిత్యం గా పరిగణించేవాణ్ణి. మా తెలుగు మాస్టార్లు పలికించిన పద్యాల ప్రతిపదార్థాలు కూడా బట్టీయం వేసినవే కానీ సిరీయస్ గా చదివినవి కావు. కాకపోతే హిందీ పాటలు ( చాలామందికి తెలియదు కానీ అందులో ఉర్దూ భాషే ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ముస్లీం ఉర్దూ కవుల ప్రభావం) వినేవారికి ఎంతో కొంత కవిత్వం లోపలికి
సాహిత్యం కవిత్వం

నా తలపుల తలుపులు తెరిచీ..

నా జ్ఞాపకాలునీ రెక్కలునీ రెక్కలునా జ్ఞాపకాలు ఎగరు సీతాకోకనింగి అందేదాకా ఎంత సున్నితంగాతాకుతాయో కదా నీ రెక్కలుగాలిని నీ రెక్కల కుంచెతోగాలి కాన్వాస్ మీదఎన్ని వర్ణచిత్రాలు వర్షిస్తావో కదా రుతువుల మోములన్నీమోహపు వీణలౌతాయి కవితలేవో నేను అల్లడానికికుట్ర పన్నుతాయి నీ రెక్కలు కదిలినప్పుడంతానాలో స్ళేఛ్ఛా కాంక్ష పురి విప్పిన నెమలి అవుతుందిఅరణ్యం పై పరుచుకునే కెంజాయరంగౌతుంది అపుడునా ఏకాంతాన్నీ,నా భావాలనూనీ భుజాలు నొప్పెట్టెలా  మోస్తావు నా ఊహల స్పర్శతోనీ రెక్కలు పులికిస్తాయోనీ రెక్కల స్పర్ళతో నా ఊహలు అలలై కదులుతాయో తెలియదు కానీ నీ రెక్కలు కదిలేప్పుడంతానేనూ కదులుతానునా గుండెకొక లయ ఉన్నట్టనిపిస్తూనాకు నేను కొత్త కావ్యాన్నై పరిచయమౌతాను
సాహిత్యం కవిత్వం

ఎడారి పుష్పం

పొగమంచు కౌగిలిలో ఈ రోజు తెలవారింది.నేల తన దేహాన్ని చలిపూలతో సింగారించుకుంది. నెగళ్ళ వేడిలో లోకం సెదదీరుతోంది మనసుని మంచుగడ్డలా మార్చేసినఈ శీతాకాల వేళనా రెప్పల మీద వెచ్చటి పెదవుల బరువునిమోపిపోయావుదేహం పులకరింతల పూల తపనల పలవరింతలలోచలించిపోయింది రేపన్నదొకటి నా ఆయుష్షులోకి దిగిఉంటేనేనేం కోరుకోవాలి? తల్లి ఒడిలాంటి వెచ్చదనం తెలిసిననీ ముద్దూనీ ఆలింగనం తప్పనీతో ఏకాంతంలో నడిచే కొన్ని అడుగులు తప్ప భయపడకు ప్రియామన అడుగులు పడే  దారిలో నీకై పూలూనాకై ముళ్ళూ ఉంచబడ్డాయిగాయాలనే పూలని నమ్మే నాకుపూలు కూడా గాయం చేయగల సున్నితమైన ప్రియురాలుండడం గొప్ప బహుమానం కదూ? కాదనే అనుకుందాం కాసేపు ఎడారి లాంటి నా
సాహిత్యం కవిత్వం

దీపాల వెలుతురు నీడలో

తాము కాలిపోతూవెలుతురిస్తాయి దీపాలు సమస్త చీకటి విషాలను మ్రింగికాంతినిస్తాయి మిణుగుర్లు మన గాయాల్ని వాళ్ళ దేహాల్లో నింపుకొనిమందు కనుగొంటారు శస్త్రచికిత్సా కారులు వెలివేతలను తలరాతలుగా వ్రాయించుకొనిమైలపేరుతో మూలపడిమూతులకు కుండలు కట్టించుకునేబడుగుబతుకుల్లో ఆత్మగౌరవాన్ని తట్టి లేపుతారుజ్ఞానవంతులు కార్మీక కర్షక జనావళిఊపిరికి ప్రాణం ఉందనిరుజువుచేసిసంఘటితస్పర్శ ఎంత శక్తివంతమైందో తెలియజేసినడవడానికో పోరుబాటని సిధ్ధం చేస్తారునాయకులు వాళ్ళపాదాల్రాసిన కఠిన కాల చరిత్ర పుటలపైతలలెత్తుకొని నిలబడబానికి ప్రయత్నిస్తాయిగడ్డిపోచలు గడ్డిపోచల నుదుర్లను ముద్దాడుతుందివసంతం వసంతాన్ని కౌగిలించుకుంటుంది మేఘగర్జన గూడెం పిల్లోడి చేతిలో విల్లంబులా సాయంత్రంక్షితిజం పై ఒరుగుతుంది రేపటికొక కొత్త సూర్యుణ్ణి కంటానని వాగ్ధానం చేస్తూ...
సాహిత్యం కవిత్వం

నేనే మీ కవిత్వం

నా పెదవులపై తేనెపట్టు లాంటి మాటలేవీ?అవి పక్షులై ఎగురుతుంటాయి హృదయమూ మాటల మధుపాత్రే ఇపుడు మనమధ్య పదాల ప్రసారంఓ అమూల్యమైన అనుభవానికి వాగ్ధానం నిజానికి నా మాటలన్నీప్రాణవాయువుతో పాటు ఆయుష్షు గానాలోకి మీ నుంచి వచ్చి చేరినవే నా ప్రాణం లోపలుందని అనుకునేరుఅది బయటే ఉందినాతో కలిసి నడుస్తున్న వాళ్ళూనా భాగానికి ఇన్ని గింజలు పండిస్తున్న వాళ్ళూనా నడక కోసం దారుల్ని పరిచినవాళ్ళూనేనేదైనా చౌరస్తాలో నిలబడి ఉద్యమాచరణలో భాగంగా నినదిస్తున్నపుడు ప్రతిధ్వనిని అందించేవాళ్ళూ మీరు మీరు మీరంతా నా ప్రాణసమానులుమీరే నా మాటలలోని బరువుకు కారణమైనవారునా పద్యపాదాల్లో జీవం నింపే బతుకుపోరాటంలో నిండా మునిగిఉన్నవాళ్ళు మీ నవ్వులు నా