కవిత్వం

కన్నీటిని రాల్చకు

నాకోసం కన్నీటిని రాల్చకండి వీలైతే కొన్ని అక్షరాల ఆమ్లాన్ని జల్లండి దీనంగా చూస్తున్న ఈ నాలుగు దిక్కులు అంతమవ్వని.. నా మీద జాలి చూపకండి కొన్ని పల్లేరు కాయల్ని నాటండి రేప్పొద్దున ఆ దారి గుండా నడిచే మత రాజకీయాల కాళ్ళను చీల్చనీ.. నాపై అమాయక స్త్రీ అని ముద్ర వేయకండి ఈ నీచ సంస్కృతి, సంప్రదాయాలను బోధించిన మత గ్రంథాల, కుల గొంతుకలకు నిప్పెటండి కాలి బూడిదవ్వని.. నన్ను ఇలానే నడిపించండి కశ్మీర్ నుండి కన్యాకుమారి దాక 21 వ శతాబ్దపు దేశ నగ్న చరిత్రను పుటలు పుటలుగా చదివి కాడ్రించి ఉమ్మనివ్వని.. నా తరపున న్యాయ