‘సాహిత్య విలోచన’ మెదడుకు మేత పెట్టగల శీర్షిక. ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా సాహిత్య విమర్శ తత్వాన్ని వెలికి తీసి చారిత్రక సైద్ధాంతిక దృక్పథంతో, నిర్మాణాత్మక పరిశీలన ఈ పుస్తకంలో ఉంటుందని పాఠకులకు అనిపించేలా వి. చెంచయ్యగారు తన వ్యాస సంపుటికి ఈ పేరు పెట్టారు. నిజంగానే ఇది సాహిత్యం గురించి, సాహిత్య విమర్శ గురించి విస్తృతమైన రాజకీయ సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక ప్రశ్నలను, సమాధానాలను అందించింది. ఇందులోని ప్రతి వ్యాసం అలాంటి అనేక వాదనలు, మేధో చర్చలను రేకెత్తిస్తుంది. ఈ వ్యాసాలు కేవలం సాహిత్య విమర్శ వ్యాసాలే కాదు. విమర్శకుడి వ్యక్తిత్వమూ, అతని విమర్శ