18 నవంబర్ 2021 మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా విప్లవోద్యమ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజుగా మిగిలిపోతుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు జిల్లా గడ్చిరోలీలోని ధనోరా తాలూకా గ్యారపత్తి పోలీసు స్టేషన్ పరిధిలోకల మర్దిటోల అడవిలో 10 గంటలకు పైగా జరిగిన భారీ ఎన్కౌంటర్లో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ దీపక్ (మిలింద్ బాబూరావ్ తేల్తుంట్లే) సహ 27 మంది కామ్రేడ్స్ అమరులైనారు. శతృవుతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీరయోధులకు వినమ్రంగా తలవంచి విప్లవ జోహార్లు చెపుదాం. చెరిగిపోని అమరుల జ్ఞావకాలలో మునిగిన వారి బంధుమితృలంతా ఈ విషాదకర సమయంలో నిబ్బరంగా నిలువాలనీ