భారతదేశ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొందిన మల్లయోధులు ఏప్రిల్ 5వ తేదీ నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు 2023 జనవరిలో బహిరంగం కావడంతో నిరసనలు ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత ప్రభుత్వం లైంగిక వేధింపుల ఆరోపణలపై నిష్పాక్షిక స్వతంత్ర కమిటీ విచారణ జరుపుతుందని వారికి హామీ ఇచ్చింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశం వచ్చేవరకు పోలీసులు ఎంపీపై కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. లైంగిక నేరాల నుండి పిల్లలను