Herr Vogt జర్మన్ ప్రచురణ-1860 ఇంగ్లిష్ అనువాదం : 1982 పుస్తకం కంపోజింగ్, ముద్రణ, బైండింగ్ - ట్రేడ్‌యూనియన్ లేబర్ కార్ల్‌మార్క్స్ విస్తృత రచనల్లో ఒక విస్మృత గ్రంథం Herr Vogt. ఆయన సమగ్ర రచనల జాబితా తయారు చేసేటప్పుడు తప్ప ఈ పుస్తకం పేరు మరెక్కడా వినపడదు. మార్క్స్ ఇతర రచనల గురించి సుదీర్ఘంగా, సూక్ష్మంగా చర్చించిన పండితులు కూడా ఈ పుస్తకాన్ని, ఎందుకోగాని విస్మరించారు. ఏది ఏమైనప్పటికీ, CAPITAL రాస్తున్న దశలో ఒక సంవత్సరంపాటు ఆ కృషికి విరామమిచ్చి, ఈ పుస్తకం రాశాడు మార్క్స్. తనూ, ఎంగెల్స్ ఇతర మిత్రులకు వ్యతిరేకంగా కార్ల్‌వోగ్ట్ అనబడే పెద్దమనిషి