కవిత్వం

అమరుని తల్లి

ఇంతకీ…ఈ ఆపదను తట్టుకోమనే ఓదార్పు మాటలు చెప్పడానికి ఆ తల్లికి అక్కడ ఎవరూ లేరు.నీ సానుభూతంటావా.. ఆమెకి అవసరమే లేదు.నీ మాటలంటే ఆమెకి లెక్కే లేదు.అసలు ఆమె ఎవరనుకుంటున్నావు?ఆమె అమరుని తల్లి !ఒకటి,రెండు,మూడు,నాలుగు ,ఐదేసి చుక్కలు.. చుక్కలుగా కపటంతో రాలిపోయే నీ మొసలి కన్నీళ్లనే… ఆమె తన తెగువతో ఆశ్చర్య పరుస్తుంది..నిలవరిస్తుంది!మూగ ప్రేక్షకుల దొంగ సానుభూతి ఆమెకెందుకు ? కౄరంగా చంపబడిన తన కొడుకులు మిగిల్చిన ఖాళీని..నీ అల్పమైన సహనుభూతితో పూడ్చలేవు.కొడుకుల మరణ దుఃఖాన్ని గుక్కిళ్లు గా మింగెయ్యమని.. మౌనంగా ఉండమని ఆమెకి చెప్పే అర్హత నీకు లేదు గాక లేదు !ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా..?నీ