కవిత్వం

రూపాంతరం

నీకోసం నేకవితలు రాయలేను. రూపాంతరం చెందిన దుఃఖగాధ ల్ని మాత్రం విప్పగలను వసంతం తరలిపోయింది ఎండాకాలపు ఒడిలో స్వార్థపు క్రీడల్లో నదులు ప్రేతాత్మల్లా కళ్ళు తేలేశాయి అవతల ప్రైవేటు ఆస్తుల సైన్ బోర్డులు పెటపెటలాడుతున్నాయి. ఇంతకు చేపలన్నీ ఎక్కడికెళ్లాయి వన సంరక్షణ సమావేశంలో ప్లేట్లలో ముక్కలుగా నిండిపోయాయి వాటి తెల్లని కనుగుడ్లను జాగ్రత్తగా పీకేశారు ఓ ఘనమైన మెమొరాండంను మాత్రం వాటి ముందు చదువుతారు చచ్చిన చేపలకు అది వినపడుతుందా.. *** చంకలో వెంట్రుకల్ని సాపు జేసినట్టు భూమి మీద చెట్లను సాపు చేస్తారు నున్నగా గొరిగిన భూమి నిత్యాగ్ని గుండమైతే మనం సమాధి నుండి లేచిన ప్రేతాత్మల్లా
కవిత్వం

విజయ చిహ్నాలు

★Victory Signs★By Moumitha Alam-west Bengal.【A poem on Manipuri Kuki tribal women who have been Paraded Naked & raped 】★విజయ చిహ్నాలు★తెలుగు అనుసృజన-గీతాంజలి ఓ..నా ప్రియమైన కుకీ తల్లులారా., మన భారత దేశంలో.. మన శరీరాలే యుధ్ధక్షేత్రాలు కాదంటారా ? పురుషులు నీళ్ల సీసాలు దొరక్క..వాటి కోసం కొట్లాడు తున్నప్పుడు కూడా.. *నీ యమ్మ..నీ తల్లిని..నీ చెల్లిని దెన్●● అనే యుగాల నుంచీ అలవాటైన బూతులతో మొదట మన తల్లులనే శపిస్తారు ! మన బట్టలు తొలగించబడతాయి.. మన మీద కిరాతకంగా లైంగిక అత్యాచారం జరుగుతుంది. క్రూరమైన జంతువుల గాయాలతో మన దేహాలు