అక్టోబర్ 14వ తారీఖు భారతదేశ విప్లవోద్యమానికి, విప్లవ శ్రేణులకు, విప్లవ కార్యకర్తలకు అత్యంత దుఃఖదాయకమైన రోజు. ఒక ఆత్మీయుడు, ఒక స్నేహశీలి, ఒక ఓదార్పు, ఒక ఊరట, ఒక నిరాడంబర, నిస్వార్థజీవి, ఒడిదుడుకుల్లో ఆత్మవిశ్వాసం నింపే ఒక ఆపన్నహస్తం, మచ్చుకైనా కోపతాపాలు ప్రదర్శించని సహన సౌమ్యశీలి, ఒక అన్వేషి, ఒక ఆర్గనైజర్, ఒక సైద్ధాంతిక రాజకీయ వ్యూహాకర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రామకృష్ణగా చిరపరిచితుడైన ప్రియతమ నాయకుడు కామ్రేడ్ సాకేత్, రామకృష్ణ, శ్రీనివాస్ (యస్.వి.), గోపాలం మాష్టారు (అక్కిరాజు హరగోపాల్) తీవ్రమైన కిడ్నీ జబ్బుతో 2021వ సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన ఉదయం 6.30 నిమిషాలకు అమరత్వం చెందారు.