సమీక్షలు

రైతు ఆత్మహత్యల  బాధాతప్త  నవల

గత ఒకటి-ఒకటిన్న దశాబ్దాల్లో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంలో, 2014లో ఆత్మహత్యల రేటు సగటున రోజుకు 52 అయిన చోట, దాదాపు 80లక్షల రైతులు వ్యవసాయం వదిలేసిన చోట, ఈ విషయంపై నలుదిశలా ఆవరించిన నిశ్శబ్దం భయానక భవిష్యత్తును, ప్రమాదకర ఆర్డిక-రాజకీయాలను సూచిస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే సీనియర్‌ నవలాకారుడు సంజీవ్‌ రాసిన కొత్త నవల “ఫాస్‌” (ఉరి) ఈ భయానక నిళ్ళబ్దం, మానవద్వేష ఆర్థిక-రాజకీయాలకు వ్యతిరేకంగా వేసిన ఒక పెనుకేక. నిజానికి వ్యవసాయం ప్రభుత్వాల, అధికార అంగాల ఆలోచనలూ, పథకాలకు మాత్రమే కాదు మధ్య తరగతి అవగాహనకు కూడా చాలా దూరం. ఏ