వ్యాసాలు

పాఠ్య ప్రణాళిక సమస్యలు

పాఠశాల విద్యలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో వివిధ అంశాల్లో సమస్యలు కొనసాగుతుండగా లేదా తీవ్రతరం అవుతుండగా,  ఇప్పుడు కొత్తగా పాఠ్య ప్రణాళిక సమస్య ముందుకు వచ్చింది. పూర్వ పరాలు పరిశీలిస్తే: 1986 లో ‘‘విద్యలో జాతీయ విధానం 1986’’, దానిననుసరించి 1989లో ‘‘జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం 1989’’ వచ్చాయి. అది ప్రధానంగా కాంగ్రెస్‌ జాతీయ వాదం, కాంగ్రెస్‌ సెక్యులరిజం, కాంగ్రెస్‌ శాస్త్ర దృక్పథంపై ఆధారపడి ఉండిరది. కొన్ని ప్రముఖ ప్రగతిశీల విషయాలు కూడా ఉండినాయి. ఏదేమైనా ఆనాటి విధానాలు భారత రాజ్యాంగ విలువలను స్పష్టంగా పునరుద్ఘాటించి, అట్టి విలువల సాధనకై రూపొందించబడినట్లు ప్రకటించాయి. ఆచరణలో చాలా సమస్యలుండినాయనేది