భారతదేశంలో విప్లవోద్యమం పీడిత తాడిత కులాలకు, వర్గాలకు చెందిన ఎందరినో ప్రజానాయకులుగా, విప్లవ నాయకులుగా తీర్చి దిద్దింది. తరతరాల కుల, వర్గ పీడనలను తుదముట్టించాలని, భారతదేశాన్ని ఒక సుందర సామ్యవాద దేశంగా మార్చాలనే స్వప్నాలను లక్షలాది యువకులు, విద్యార్థులు కనేలా చేసింది నక్సల్బరీ తిరుగుబాటు. ఆ స్వప్నాన్ని కంటూ దాన్ని సాకారం చేసేటందుకు విప్లవ బాట పట్టిన అసంఖ్యాక యువకుల్లో కా. కటకం సుదర్శన్ ఒకరు. అలాంటి వారిలోని అగ్రగణ్యుల్లో ఆయన ఒకరు. నక్సలైట్ ఉద్యమ మలి దశలోని తొలి రోజులలోనే 19 ఏళ్ల ప్రాయంలో విప్లవోద్యమంలోకి వచ్చిన కా. సుదర్శన్ యాభై ఏళ్ల పాటు విప్లవోద్యమానికే తన