వ్యాసాలు

కనీస మద్దతు ధరవెనుక వాస్తవం

నీటి కొరతతో బాధపడుతున్న పంజాబ్‌లో పంటల వైవిధ్యీకరణను అమలు చేయడం నేడు చాలా అవసరం. కానీ గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో పప్పుధాన్యాలు, ప్రత్తి, మొక్కజొన్న ఉత్పత్తి, సేకరణ గణనీయంగా తగ్గింది. ఈ పంటలను సాపేక్షికంగా చాలా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేయడం వల్ల వచ్చే ఐదేళ్లలో ఈ పంటలకు సంబంధించి  కేంద్రంపై దాదాపుగా ఎటువంటి భారం పడదు. పంజాబ్‌లో వ్యవసాయం స్థితిగతులు ఏమిటో, రైతు సంఘాలు ఢిల్లీ చలో అనే నినాదంతో పెద్ద ముందంజ వేయడానికి ఎందుకు సిద్ధమవుతున్నాయో చూద్దాం. ఫిబ్రవరి 18 వ తారీకు ఆదివారం అర్ధరాత్రి వరకు నిరసనకారులతో జరిగిన నాలుగో విడత చర్చల్లో