వ్యాసాలు

3,588 రోజుల నిర్బంధం

ప్రొఫెసర్ సాయిబాబాను తొలిసారి 2014 మే 9నాడు ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి అరెస్టు చేశారు. 2017లో సాయిబాబాతో పాటు మరో ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఉపా కింద అక్రమ నిర్బంధాన్ని పరిగణనలోకి తీసుకుని బాంబే హైకోర్టు 2022లో అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. 2023లో సుప్రీంకోర్టు అతని అప్పీల్‌ను మళ్లీ విచారించాలని నిర్ణయం ఇస్తూ  కేసును మెరిట్‌పై (తప్పు ఒప్పులపై ఆధారపడి) పరిగణించాలని ఆదేశించింది. మార్చి 5న, బాంబే హైకోర్టు మరోసారి నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది, అయితే ఈసారి ప్రాసిక్యూషన్ వాదనలు, సాక్ష్యాల్లోని బూటకత్వాన్ని బట్టబయలు చేస్తూ మెరిట్ ప్రాతిపదికన నిర్ణయం తీసుకొన్నది.