పత్రికా ప్రకటనలు

జయితా దాస్‌ను తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలి

పశ్చిమ బెంగాల్ 30.03.2022 29.03.2022 రాత్రి కోల్‌కతా పోలీసుల స్పెషల్  టాస్క్ ఫోర్స్ (STF) సామాజిక కార్యకర్త జయిత దాస్‌ను అరెస్టు చేసింది. నిన్న ఉదయం 11 గంటలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి జయిత నదియా జిల్లాలోని జగులియా క్రాసింగ్ దగ్గర ఆటో రిక్షా కోసం చూస్తుండగా జాగులియా పోలీస్ స్టేషన్ పోలీసులు వచ్చి తెల్ల రంగు  కారులో ఎక్కించుకెళ్ళారు. ఆమె చేతిలో వున్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్, కొంత డబ్బు ఉన్న బ్యాగును తీసేసుకున్నారు. తరువాత  ఆమెను ఖాళీగా ఉన్న ఒక ఇంటికి తీసుకువెళ్ళి, అరెస్టును ధృవీకరించడానికి STF అధికారి రాత్రి 8 గంటలకు వచ్చే వరకు కూర్చోబెట్టారు.