వ్యాసాలు

తిజిమాలి మా ఆత్మ

“మేము తిజ్‌రాజా పిల్లలం, మా తిజిమాలిని తవ్వడానికి ఎలా అనుమతిస్తాం? తిజిమాలి మా ఆత్మ, ఆత్మ లేకుండా ఎలా జీవించగలం? వాగులను మాత్రమే కాదు మా గుర్తింపును కూడా నాశనం చేసే గనుల తవ్వకానికి ఎలా అనుమతినిస్తాం? మేము మా మాలి కొండ కోసం, మా అడవుల కోసం, అన్ని విధాలుగా పోరాడుతామే కానీ మా ఆత్మను వేదాంత కంపెనీ తవ్వడాన్ని ఒప్పుకోం.” అక్టోబర్ 16న ఒడిశాలోని రాయగడ, సుంగర్ పంచాయతీ, కాశీపూర్ బ్లాక్‌లో జరిగే బహిరంగ విచారణకు ముందు రోజు రాత్రి తిజిమాలి పర్వత ప్రాంతంలోని బంతేజీ గ్రామానికి చెందిన మహిళలు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించాలని ఏకగ్రీవంగా