నీకు 75 ఎండ్లంటా..రోడ్ల వెంట నివాసం ఉన్నకాలి కడుపును నింపలేనందుకు,ప్రతి పుట సంబరాలు జరుపుకో.. సడక్ సందులో గుడిసేపైకప్పు లేదు,త్రివర్ణ పతాకాన్ని కప్పుదాం అంటే,శుద్ధ నీతులు చెప్పే "దేశ భక్తుల" కత్తులుఎక్కడ నా కడుపులో దిగుతాయని భయంగా ఉంది తల్లి.. నువ్వు నన్ను కన్నవంట కదమ్మ,నా జననం మురికి కాలువలోఎందుకు జరిగిందో,కొంత మంది పుట్టుక అద్దాలమేడలో ఎందుకు జరిగిందో నాకిప్పటకి తెలియదమ్మా.. మూడు రంగులునీకు అలంకరిస్తున్నరమ్మా..మాకేంటి తల్లి ఎప్పటికి జీవితాల్లో"నలుపే" కనపడుతుంది..? 75 సంవత్సరాల వయసున్న నీకు..నా దుఃఖం ఎప్పుడు వినపడుతుంది చెప్పమ్మా..?