రాజేంద్రబాబు అర్విణి అది అక్టోబర్ 6 2021. రాంమోహన్ కు రోజూ 6, 7 కిలోమీటర్లకు తక్కువకాకుండా మార్నింగ్ వాక్ చేసే అలవాటు. వనస్థలిపురం లో పార్కులు, రోడ్లు అన్నీ కలగలిపి తిరిగేవాడు. ఆ రోజు కూడా మార్నింగ్ వాక్ లో భాగంగా దాదాపు 6 కిలోమీటర్ల నడక పూర్తి చేసాడు. ఎప్పటి లాగా దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. అనారోగ్య లక్షణాలు చూచాయగా కూడా ఏమీ లేవు. ఆ రోజు... ఆ క్షణాలు... ఆ కాలం అలాగే ఘనీభవించి పోయి ఉంటే ఎంత బాగుండేది! ఆ తర్వాత మూడవ రోజు... అది అక్టోబర్ 9 - ఆ