- సిద్ధికీ కప్పన్, రైహానాలతో ఇంటర్వ్యూ (సిద్ధికీ కప్పన్ 43సంవత్సరాల వయసున్న మళయాళీ జర్నలిస్టు. కేరళ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఢల్లీి శాఖకు కార్యదర్శి. ఆయన్ను 5 అక్టోబర్ 2020న ఉత్తరప్రదేశ్లోని మథుర టాల్ప్లాజా వద్ద అరెస్టు చేశారు. ఆయనతోపాటు ఇద్దరు విద్యార్థి కార్యకర్తలు అతికూర్ రహ్మన్, మసూద్ అహ్మద్, డ్రైవర్ మొహ్మద్ ఆలంను కూడా నిర్బంధించారు. ఉత్తర ప్రదేశ్లోని హత్రాస్ అనే గ్రామంలో నలుగురు అగ్రకుల ఠాకూర్లు ఒక దళిత బాలికమీద సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనలో నిజనిర్ధారణకోసం ఆ గ్రామానికి వెళుతుండగా ఈ అరెస్టులు జరిగాయి. కప్పన్పై ఊపా, పియమ్ఎల్ఏ లతో సహా అనేక ఇతర