డిసెంబర్ మాసం, చలి కాలం రాత్రి 10 గంటల సమయం. సిల్గేర్ గ్రామం…. చింత చెట్టు కింద మండుతున్న నెగళ్ళ చుట్టూ దాదాపు 30 మంది యువతి, యువకుల బృందం కూచుని వుంది. మంటల నుంచి వచ్చే వెలుతురు చీకటిని చీలుస్తూ, చెట్ల నీడల్లో మెరుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ప్రాంతంలో ఈ సమయంలో ఇలా సమావేశం జరగడం చాలా అసాధారణమైన విషయం. భద్రతా బలగాలు, మావోయిస్టు తిరుగుబాటుదారుల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న దారుణ, సుదీర్ఘ పోరాటానికి కేంద్రంగా ఉన్న దక్షిణ బస్తర్‌లోని అడవికి నడిబొడ్డున వున్న సిల్గేర్ అనేక మంది అమాయకులు ఎదురుకాల్పుల్లో చిక్కుకున్న యుద్ధ భూమి. సాధారణంగా