నివాళి

విరసం సంతాపం

గద్దర్ లోని విప్లవ వాగ్గేయకారుడికి నివాళి.. తెలుగు ప్రజల విప్లవ సాంస్కృతిక చైతన్య ప్రతీక అయిన గద్దర్ హఠాన్మరణం దిగ్భ్రాంతికరం. తీరని విషాదం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజానాట్యమండలి అందించిన ఒరవడిని మౌళి కంగానే విప్లవీకరించి, తెలంగాణ దళిత, వెనుకబడిన కులాల  సాంస్కృతిక  అభివ్యక్తిగా మార్చి రెండు మూడు తరాల ప్రజలను గద్దర్ పోరాటాల్లోకి కదిలించాడు. ఆర్ట్ లవర్స్తో ఆరంభమైన గుమ్మడి విఠల్‍ 1972లో ఏర్పడ్డ జననాట్యమండలికి దిశా నిర్దేశం చేయగల వాగ్గేయకారుడిగా రూపాంతరం చెందాడు. ఆ కాలంలో తెలంగాణ అంతటా ప్రజ్వరిల్లిన భూస్వామ్య వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటాల సాంస్కృతిక శక్తిగా కళారంగంలో చెరగని ముద్ర
సాహిత్యం కవిత్వం

సిగ్గరి పొద్దు

నిలుచున్న పాట్నే పాటందుకొనివాలుగా జోలెట్టే సిగ్గరి పొద్దువాగుడు గుల్లల సంద్రాన మణిగిఇంత రొదలోనూ తొణకని సద్దు భూమిలోకంటా చూస్కుంటాగీట్లను అటూఇటూ కలబెడుతూ…భూమిలోకంటా చూస్కుంటాచుక్కల లెక్కల చిక్కులు తీస్తూ..భూమిలోకంటా చూస్కుంటాఅదాటున మాటలాడుతూ… చూసినవాళ్లు అన్నారు కదా!'ప్రేమించడమంటే అట్టా..చుట్టుముట్టినవాళ్లు చెప్పారు కదా!బాటా కుమనిషంటే అట్టా…కలిసినవాళ్లూ, చేతులు కలిపినవాళ్లూపిల్లలను తోడిచ్చిన వాళ్లూ నమ్మారు కదా!తూటాకు శాంతి మొలిస్తే అట్టా… జంగమస్థానం కోసం జల్లెడపట్టిన నెత్తుట మెత్తని నెత్తావిమట్టి వాసనలేసే మౌనానికిమాటిస్తే, ముఖమిస్తే అట్టా సారూ!
సాహిత్యం వ్యాసాలు

నిషేధాన్ని ఇలా చూద్దాం!

నిషేధ కాంక్ష లేని సమాజాలు లేవు. అన్ని సమాజాలూ మనుషులపై పగ పూనినవే. ఏ సమాజంలోనూ మనుషులు తాము న్యాయం అనుకొన్నదానిని సాధించుకోలేకపోయారు. ఒక నమూనాగా కొంత నిడివితో నడిచిన సమాజాలు ఇందుకు మినహాయింపు కావచ్చు. నిరంకుశ పాలకవర్గ భావజాలాలన్నీ చరిత్రలో మనుషులను సమస్యగా చూసినవే. నేటి పాలకవర్గ భావజాలమైన ఫాసిజం ఈ చారిత్రక వాస్తవానికి విషాద ముగింపును ఇవ్వడానికి తొందర పడుతోంది. మరోవైపు, నేటి రాజకీయం మావోయిజం ఈ ప్రమాదాన్ని తప్పించి, మనిషిని ఏకైన పరిష్కారంగా ఎత్తిపట్టేందుకు ముందుకొచ్చింది. ఈ రెండు భావజాలాలకూ వేళ్లు రాజకీయార్థిక పునాదిలోనే ఉన్నాయి. ఆ విషయాల్లోకి వెళ్లే ముందు, ముందుగా మనుషులు తమ చైతన్యం, అవసరాలు,
సాహిత్యం కవిత్వం

స్వప్నకథనం

శూన్యగోళంలో తిరుగాడే పిట్టజీవావరణంలో ఇమడలేకగహన గగనం చేరలేకమన బాల్కానీ ఊచల మీద టపటపమన తలుపుల మీద టకటకమన గుండెలకు దగ్గరగా గునగునగుండే గువ్వై ఎగిరిపోన... కల అయిపోలేదుతూటాల మీదుగా పూలతుంట్లు తుంచిపాపల బుగ్గల నుంచి లేత గులాబీలు తెంచిమొర చాపిన లేగ ముట్టెకు ముద్దిచ్చిముట్టించి, ముట్టడించి,దట్టించి, దహించిరివ్వున. కెవ్వన... ఎగిరిపోన.. కలఅయిపోలేదుకనలి కనలికదిలి కదిలిఉప్పటి కన్నుల మీదుగా జారిచప్పటి పెదవుల మీదకు చేరిచప్పున తోలేలోపే ఎగిరిపోన..
సాహిత్యం కవిత్వం

సబ్జెక్ట్‌ కరెక్షన్‌

బిర్యానీ తినిపించి బంగ్లా రాయించేసుకొన్నాకకత్తి చేతికందించి మెడ తెంచుకుపోయాక మత్తు దిగేక అస్తుబిస్తుగా మిగిలేక ఓ మనిషీ ఓ మనీషి ఓ మహర్షీ మాయమయ్యాక కలి ఉలి ఆగిందిశిలకు ఆకలి మొదలైంది...