నివాళి

చెదరని వర్గానుబంధం

కామ్రేడ్ అనితక్క అమరత్వ వార్త వినగానే ఒక్కసారిగా తన మాటలు, గురుతులు, ఆత్మీయత గురుతొచ్చింది. ఎప్పుడూ తన ముఖం పై చెరగని చిరునవ్వు, ప్రతి పనిలో సమష్టి భావన, ప్రతి కామ్రేడ్ తో పెనవేసుకొనిపోయే తత్వం కా.అనితక్క సొంతం. ప్రజలత్, సోదర కామ్రేడ్స్ తో ప్రేమ పంచుకోవడం తనకు ప్రజలు నేర్పిన విద్య. నేను దళంలోకి వచ్చిన మరుసటి రోజునే తెలంగాణ చరిత్ర పై క్లాసు మొదలైంది. క్లాసులో ‘‘నీవు కూడా కూర్చుంటున్నావు కదూ!’’ అంటూ కా.హరిభూషణ్ నన్ను అడిగాడు. ఆ క్లాసుకు ఆయనే టీచర్.  సభ్యుల నుండి డీవీసీ వరకూ అందులో పాల్గొన్నారు. ఆ క్లాసులో కా.