సుమతి గురించి అందరికీ తెలియాలి. అంత అద్భుత మహిళ ఆమె. మొదట ఆమె చాలా మామూలు మనిషి. కానీ లోకాన్ని తెలుసుకున్నది. తననుతాను తెలుసుకున్నది. పితృస్వామ్యాన్ని అర్థం చేసుకున్నది. మాతృత్వ భావనను సహితం అధిగమించి నూతన మానవి అయినది. వ్యవస్థ సంకెళ్లను తెంచుకున్నది. ఎంత పరిణామం జరిగి ఉండాలి! భౌతిక, భావజాల ప్రపంచంలో ప్రజలు సాగిస్తున్న మహాద్భత పోరాటాల ప్రమేయం లేకుండా ఆమె కామ్రేడ్ సుమతిగా పరివర్తన చెందాదా? మానవజీవితాన్ని విలువల, విశ్వాసాల పరివర్తనా క్రమంలో చూసే సాహిత్యకారులకు తప్పక సుమతి తెలిసి ఉండాలి. అందుకే నాకు తెలిసిన కామ్రేడ్ సుమతి గురించి నాలుగు మాటలు మీతో. సుమతి