ఆగస్టు 1, 2022న మేడ్చల్ జిల్లా కౌకూర్‌లో ఓ ఇంటి వద్ద సిపిఐ (ఎం- ఎల్) జనశక్తి నాయకులు కామేడ్ కూర రాజన్నను సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారన్న విషయం విధితమే. ఈ అరెస్టు విప్లవ సంస్థలు, పౌర హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు అందరూ ఖండించారు. అలాగే ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. కామ్రేడ్ కూర రాజన్న అరెస్టును ఖండిస్తూ ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 17న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వక్తలందరు రాజన్న అక్రమ అరెస్టును ముక్త కంఠంతో ఖండిస్తూ, రాజకీయ ఖైదీలందరిని బేషరతుగా విడుదల చేయాలని