సాహిత్యం కవిత్వం

మృత్యువు దాడిచేసిన రాత్రి అక్షరాలకు జీవం పోస్తున్నాడు

రాత్రి గడియారంలో కాలం నిలిచిపోయింది రక్తం కక్కుకుని ప్రభాకర్ కన్నుమూసాడని గాలిలో సగం తెగిన నరాల తరంగాల స్వరాలు కాలం నిలిచేమీ పోలేదు నీ శవం దగ్గర కూడా గతమూ వర్తమానమూ ఘర్షణ పడి నీ ఆశయ నినాదాలతో మేమే ముందుకు సాగాం సూర్యుడు సంక్రాంతి లోకి పయనించాడు రాస్తూ రాస్తూ అలవాటుగా గోడవైపు చూశాను అవును నేస్తం నువు ప్రేమగా యిచ్చిన గడియారంలో ముళ్ళు ఆగిపోయాయి సరిగ్గా నీ అస్తమయం దగ్గర కాలం ఫ్రీజ్ అయినట్లు కాదు, నీ ముళ్లబాట జీవితం అక్కడితో ముగిసింది నీ ఊపిరితిత్తుల నుంచి తీసిన నెత్తుటి సిరంజిలా సెకన్ల ముల్లు ఆగిపోయింది