కథలు

కొత్త బంగారు లోకం

సూర్యుడు పడమర దిక్కున ఎరుపు రంగులోకి మారుతూ, మెల్లమెల్లగా కిందికి జారుకుంటున్నాడు. అప్పుడు సమయం 6 గంటలు. 5, 6 ఇండ్లున్న ఆదివాసీ గ్రామం చేరుకున్నాం. నేను బాబాయ్‌, మమల్ని తీసుకొచ్చిన అన్నయ్య, మేము కలవాల్సిన వారి కోసం ఎదురు చూస్తున్నాం. ఫోన్‌లో మాట్లాడక, మెసేజ్‌ చూసుకోక సరిగ్గా 48 గంటలవుతోంది. వాచ్‌ ప్రతి గంటకు శబ్దం చేయగానే, నాకేదో మెసేజ్‌ వచ్చినట్లుగా నా చూపులు సైడ్‌ బ్యాగ్‌ వైపు వెళుతున్నాయి. తీరా వాచ్‌ సౌండ్‌ అని ఓ లుక్‌ వాచ్‌పైకేసా. నేనొచ్చే ముందు డిజిటల్‌ వాచ్‌ ఐతే అక్కడి ప్రదేశానికి అనుకూలమని మా పిన్ని కొనిచ్చింది. డిజిటల్‌