కవిత్వం

ట్రాన్సజెండర్

చెక్కిళ్ళపైన గులాబీ రంగు అద్దుకొని, మెడ చుట్టూ నెక్లెస్ వేసుకుని షేవ్ చేసిన గడ్డం పై గాఢమైన మేకప్ అద్దుకొని ఆమె తనని తాను అద్దంలో చూసుకుంది ముక్కలైన అద్దంలో తన లక్షల ప్రతిబింబాలను ఒకేసారి ఆమెగా/ అతనుగా చూసుకుంది అద్దంలో ఆ బొమ్మలు ఒకదాన్ని మరొకటి వెక్కిరించుకున్నట్లు గా అనిపించింది మరొకరి దేహంలో తను ఇరుక్కు పోయి వూపిరాడనట్లు అనిపించింది తన దేహపు ఆకృతికి...కోరికలకు పొంతనే లేదు నేను ఎక్కడికి/దేనికి సంబంధించిన దాన్ని ? సరిగ్గా నేను ఎక్కడ ఇమడగలను ? లాంటి ప్రశ్నలు ఎడతెరిపిలేకుండా ఆమెని వేధిస్తాయి **** కొయ్యడానికి కూడా సాధ్యం కాని రంపపు