పత్రికా ప్రకటనలు

గ్రోవ్ వాసుకు మద్దతుగా  విద్యార్థి సంఘాలు 

తేదీ: సెప్టెంబర్ 7, 2023 కార్పొరేట్ సంస్థలు, ఫాసిస్టులు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేరళ అంతటా అనేక నిరసనలకు నాయకత్వం వహించిన, గ్రో వాసు అనే పేరుతో ప్రసిద్ది చెందిన వాసును జైలులో నిర్బంధించి అతని పౌర హక్కులకు భంగం కలిగించడాన్ని విద్యార్థులమైన మేము సమైక్యంగా ఖండిస్తున్నాము. ఏడేళ్ల నాటి కేసులో, 2016 నవంబరు 24న సీఎం పినరై విజయన్ నేతృత్వంలోని హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేరళ పోలీసుల థండర్ బోల్ట్ కమాండోల చేత హత్యకు గురైన, అనారోగ్యంతో ఉన్న అజిత, కుప్పు దేవరాజ్ అనే ఇద్దరు మావోయిస్టుల బూటకపు ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా కోజికోడ్ మెడికల్