ప్రముఖ కథా, నవలా రచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి మే 22న మృతి చెందారు. ఆయన కథ, నవల, సాహిత్య విమర్శ, సంపాదకత్వం వంటి అనేక ప్రక్రియల్లో విరివిగా పని చేశారు. విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా వృత్తి సంబంధమైన పనుల్లో కూడా ఆయన ప్రత్యేకత ఉన్నది. ఆయన సుదీర్ఘ సాహిత్య జీవితంలో అనేక ఉద్యమాలు, వాదాలు వచ్చినా ఆయన నేరుగా వాటితో ప్రభావితం కాలేదు. తన తొలినాళ్ల గ్రామీణ జీవితానుభవం ఆయన కాల్పనిక రచనలకు చోదకంగా పని చేసింది. అక్కడి నుంచే ఆయన ప్రపంచంలో జరుగుతున్న చాల పరిణామాలను చూశారని ఆయన కథలనుబట్టి చెప్పవచ్చు. అట్లా రాయలసీమ ప్రాదేశిక జీవితానుభవం,