నివాళి

జహీర్‌ అలీఖాన్‌కు విరసం నివాళి

ఈ ఖాళీ ఇప్పట్లో భర్తీ అయ్యేదేనా? ఒక మత సమూహం మీద ఉగ్రవాదులని ముద్రవేసి, హీనపరిచి అభద్రతకు గురి చేస్తున్న రోజుల్లో అక్కడి నుంచే వచ్చిన లౌకిక ప్రజాస్వామికవాది జహీర్‌ అలీఖాన్‌ అకాల మరణం తీరని లోటు. కాలం అన్ని ఖాళీలను భర్తీ చేస్తుందనే భరోసా పెట్టుకోగలం కాని, జహీర్‌ అలీఖాన్‌లాంటి పాత్రికేయుడు, బుద్ధిజీవి, లౌకికవాది ఇప్పుడప్పుడే వస్తారని అనుకోగలమా? గతం కంటే ఎక్కువ వత్తిడితో జీవిస్తున్న ముస్లింలకు అండగా నిలవగలవాళ్లు రాగలరా? హిందూ ముస్లిం భాయీ భాయీ అనే జీవన సందేశాన్ని ఆచరణలో బతికించగల జహీర్‌ అలీఖాన్‌ వంటి వ్యక్తులు అన్ని వైపుల నుంచి అత్యవసరమైన కాలం
నివాళి

విరసం సంతాపం

గద్దర్ లోని విప్లవ వాగ్గేయకారుడికి నివాళి.. తెలుగు ప్రజల విప్లవ సాంస్కృతిక చైతన్య ప్రతీక అయిన గద్దర్ హఠాన్మరణం దిగ్భ్రాంతికరం. తీరని విషాదం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజానాట్యమండలి అందించిన ఒరవడిని మౌళి కంగానే విప్లవీకరించి, తెలంగాణ దళిత, వెనుకబడిన కులాల  సాంస్కృతిక  అభివ్యక్తిగా మార్చి రెండు మూడు తరాల ప్రజలను గద్దర్ పోరాటాల్లోకి కదిలించాడు. ఆర్ట్ లవర్స్తో ఆరంభమైన గుమ్మడి విఠల్‍ 1972లో ఏర్పడ్డ జననాట్యమండలికి దిశా నిర్దేశం చేయగల వాగ్గేయకారుడిగా రూపాంతరం చెందాడు. ఆ కాలంలో తెలంగాణ అంతటా ప్రజ్వరిల్లిన భూస్వామ్య వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటాల సాంస్కృతిక శక్తిగా కళారంగంలో చెరగని ముద్ర
ఖండన

బెల్లాల పద్మ, దేవేందర్‌ అరెస్టులను ఖండించండి

జూన్‌ 18 సాయంకాలం గుంటూరు దగ్గర ఓ గ్రామంలో బెల్లాల పద్మను, అదే రోజు హైదరాబాదులో దుబాసి దేవేందర్‌ను ఎన్‌ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. పద్మ అనేక అక్రమ కేసుల్లో సుదీర్ఘకాలంపాటు జైలులో ఉండి విడుదలై వచ్చింది. పద్మ అనే పేరు మీద నమోదై ఉన్న అక్రమ కేసులన్నిటినీ అమె మీద మోపి జైలు నుంచి బైటికి రాకుండా చేశారు. ఆ నిర్బంధాన్ని దాటి బైటికి వచ్చే సరికి ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది. తిరిగి మామూలు పరిస్థితికి రాలేదనంతగా శరీరం శిథిలమైపోయింది. అయినా ఓపికగా న్యాయశాస్త్రం చదివింది. ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూనే ఓపిక ఉన్నప్పుడు సభలకు హాజయ్యేది.
ఖండన

చంద్రశేఖర్‌ అజాద్‌పై ఫాసిస్టుల హత్యాయత్నం

ఫాసిస్టు బుల్డోజర్‌ బాహాటంగానే రాజకీయ హత్యాయత్నాలకు పాల్పడుతుంది. తన ఆధిపత్యానికి, రాజకీయ సమీకరణాలకు అడ్డంగా ఉన్న ఏ శక్తినీ అది భరించలేదు. దీనికి ఉత్తరప్రదేశ్‌లో భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ రావణ్‌పై కాల్పులు ఉదాహరణ. జూన్‌ 28 బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు వెళుతుండగా ఆయన వాహనానంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.  ఈ ఘటనలో ఆయన శరీరంలోకి రెండు తూటాలు దూసుకెళ్లాయని వైద్యులు తెలిపారు.  సహరాన్‌పూర్‌ ఆసుపత్రిలో  డాక్టర్లు ఆయనకు వైద్యం చేస్తున్నారు.             ఈ ఘటనకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులను దేశ ప్రజలందరూ గుర్తుపట్టగలరు. ఉత్తరప్రదేశ్‌లోని  ఫాసిస్టు రాజ్యం తీవ్రరూపాలు దేశమంతా తెలుసు.
ఖండన

తులసి చందు భావ ప్రకటనా స్వేచ్ఛను ఫాసిస్టులు అడ్డుకోలేరు

జర్నలిస్టు తులసి చందును బెదిరిస్తూ, అసభ్యకర మాటలతో నిందిస్తూ సంఫ్‌ుపరివార్‌ మూక దాడి చేయడాన్ని విరసం ఖండిస్తోంది. ఆమె గత కొద్దికాలంగా ప్రజా సమస్యల మీద వీడియోలు రూపొందిస్తోంది. అందులో ఆమె చెప్పే వాస్తవాలకు, విశ్లేషణలకు విశేష ఆదరణ దొరుకుతోంది. ఆమె తీసుకొనే ప్రజాస్వామిక వైఖరిని వీక్షకులు అభినందిస్తున్నారు. కల్లోలభరిత ప్రజా జీవితాన్ని అర్థం చేసుకోడానికి ఆమె మాటలు దోహదం చేస్తున్నాయి. జర్నలిస్టులైనా, రచయితలైనా ఫాసిస్టు వాతావరణాన్ని వివరిస్తూ వాస్తవాలు చెప్పడం తమ బాధ్యత అనుకుంటారు. సత్యాన్ని ప్రకటించని రచన, జర్నలిజం వ్యర్థం. కానీ సత్యమంటే ఫాసిస్టులకు భయం. సత్యం చెప్పేవాళ్లంటే కంటగింపు. దేశవ్యాప్తంగా పాత్రికేయుల మీద, రచయితల
నివాళి

సీమ కథా ఆధునికతలో దీపధారి

ప్రముఖ కథా, నవలా రచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి మే 22న మృతి చెందారు. ఆయన కథ, నవల, సాహిత్య విమర్శ, సంపాదకత్వం వంటి అనేక ప్రక్రియల్లో విరివిగా పని చేశారు. విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా వృత్తి సంబంధమైన పనుల్లో కూడా ఆయన ప్రత్యేకత ఉన్నది.  ఆయన సుదీర్ఘ సాహిత్య జీవితంలో అనేక ఉద్యమాలు, వాదాలు వచ్చినా ఆయన నేరుగా వాటితో ప్రభావితం కాలేదు.  తన తొలినాళ్ల గ్రామీణ జీవితానుభవం ఆయన కాల్పనిక రచనలకు చోదకంగా పని చేసింది. అక్కడి నుంచే ఆయన ప్రపంచంలో జరుగుతున్న చాల పరిణామాలను చూశారని ఆయన కథలనుబట్టి చెప్పవచ్చు. అట్లా రాయలసీమ ప్రాదేశిక జీవితానుభవం,
పత్రికా ప్రకటనలు

ఆయనకు ఆ శిక్ష చాలదు

యాసిన్‌మాలిక్‌ను ఉరితీయాలన్న ఎన్‌ఐఏ వాదనలను ఖండించండి  యావజ్జీవ ఖైదీగా ఉన్న కశ్మీర్‌ పోరాట నాయకుడు యాసిన్‌మాలిక్‌ను ఉరి తీయాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మే 29న ఢల్లీి కోర్టులో వాదించింది. ఇటీవల ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటీషన్‌ మీద తుషార్‌మెహతా కోర్టులో తమ వాదనలు వినిపిస్తూ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటి అత్యంత ప్రమాదకరమైన, అరుదైన నేరానికి పాల్పడినందు వల్ల యాసిన్‌ మాలిక్‌కు ఇప్పుడు విధించిన శిక్ష సరిపోదని, ఉరిశిక్ష విధించాలని కోరాడు. ఆయన చేసిన నేరాల తీవ్రతను చాటడానికి ఒసామాబిన్‌ లాడెన్‌ పేరు కూడా ప్రస్తావించాడు. ఇలాంటి కఠినమైన శిక్షలు విధించకపోతే నిరంతరం ఎవరో ఒకరు సాయుధ