పత్రికా ప్రకటనలు

రాజ దండం పాలనలో క్రీడాకారులపై దాడి

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బట్టబయలు చేస్తూ, రాజ్యాంగ ఆదర్శాలను అవహేళన చేస్తూ, ఇది అధికారికంగా కూడా హిందుత్వ రాజ్యమని ప్రకటిస్తూ మే 28న కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని అనేక రాజకీయ పార్టీలు బహిష్కరించాయి. అట్లాగే  మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై   చర్యలు తీసుకోవాలని కోరుతూ చాలా కాలంగా  పోరాడుతున్న క్రీడాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశ ప్రతిష్టను క్రీడాకారులు దశ దిశలా వ్యాపింపజేస్తారని పొగిడే పాలకులు న్యాయమైన డిమాండ్‌ మీద రాజీపడకుండా పోరాడుతోంటే తమ సహజమైన అణచివేత చర్యలకు
పత్రికా ప్రకటనలు

ఆదివాసుల మీద వైమానిక దాడులుఎందుకు చేస్తున్నారు?

ఆహ్వానందండకారణ్యం శతృదేశమా?ఆదివాసుల మీద వైమానిక దాడులు ఎందుకు చేస్తున్నారు?చర్చా కార్యక్రమం21 మే, 2023 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5.30 దాకా మిత్రులారా చత్తీస్‌ఘడ్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా డ్రోన్లు, హెలికాప్టర్లతో దాడులు చేస్తున్న సంగతి మీకు తెలిసిందే.  ఈ దాడులు మొదట 2021 జూన్‌ 19న బీజాపూర్‌ జిల్లాలో బొట్టలంక, పాలగూడెం గ్రామాల మీద మానవ రహిత డ్రోన్లతో  12 బాంబులు వేయడంతో మొదలయ్యాయి. ఆ తర్వాత 2022 ఏప్రిల్‌ 14, 15 తేదీల మధ్య రాత్రి బీజాపూర్‌, సుక్మా జిల్లాల మధ్య ఉన్న బొట్టెంతోగె, మెట్టగూడెం, దులోడ్‌, సక్లెట్‌,
నివాళి

విప్లవ ప్రేమికుడు కామ్రేడ్‌ ఎల్‌. సుబ్బయ్య

బిఎస్‌ఎన్‌ఎల్‌ రిటైర్డ్‌ ఉద్యోగి, విప్లవాభిమాని ఎల్‌. సుబ్బయ్య(88)గారు గత కొద్ది కాలంగా వయోభారంతో, అనారోగ్యంతో బాధపడుతూ  ఏప్రిల్‌ 6వ తేదీ హైదరాబాదు ఆస్పత్రిలో అమరుడయ్యాడు. ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్తగా మొదలై జీవిత పర్యంతం లౌకిక ప్రజాస్వామి విప్లవశక్తుల పక్షాన దృఢంగా నిలబడ్డారు. బైటి ప్రాంతాల్లో కర్నూలు సుబ్బయ్యగారిగా ఆయన అనేక మంది ప్రజాసంఘాల కార్యకర్తలకు, మేధావులకు, రచయితలకు చిరపరిచితుడు. కోవిడ్‌కు ముందు మూడు నాలుగేళ్ల  వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఎక్కడ ప్రజాసంఘాల కార్యక్రమాలు జరిగినా తప్పక హాజరయ్యేవారు. ఏ ప్రగతిశీల సంస్థ కార్యక్రమం జరిగినా, ఉద్యమం నడిచినా వాటికి సంబంధించిన కరపత్రాలను  ప్రజల్లోకి తీసికెళ్లడం ఆయనకు
ఖండన

ఆదివాసులపై వైమానిక యుద్ధాన్ని ఖండించండి

రాజ్యంగ వ్యతిరేక ఫాసిస్టు దాడులపై ప్రజాస్వామిక శక్తులను ఐక్యం చేద్దాం ఏప్రిల్‌ 7వ తేదీ శుక్రవారం దండకారణ్యంలో మరోసారి భారత ప్రభుత్వం వైమానిక దాడులు చేసింది. ఈ ఏడాది జనవరి 11న  గగన తల దాడులు జరిగిన మూడు నెలలకల్లా మరోసారి డ్రోన్ల నుంచి  బాంబులు విసిరారు. పామేడు ప్రాంతంలోని బట్టిగూడ, కవరగట్ట, మీనగట్ట,  జబ్బగట్ట గ్రామాల పరిధిలో తెల్లవారు జామున  ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఆదివాసులు ఆ సమయంలో విప్ప పూలు ఏరుకోడానికి అడవిలోకి వెళ్లారు. కొందరు పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. ఉదయం 6 గంటలకు మొదలైన బాంబు దాడులు ఐదు నిమిషాల వ్యవధిలో వేర్వేరు
పత్రికా ప్రకటనలు

బైరి నరేష్‌ పై హిందుత్వ మూకల దాడి

నరేష్‌పై హిందుత్వ శక్తులు ఫిబ్రవరి 27న మరోసారి దాడికి పాల్పడ్డాయి. ఈసారి పోలీసుల సమక్షంలోనే  దాడి జరిగింది.   మనోభావాలు దెబ్బతిన్న భక్తుల మూక ఈ పని చేసిందా? లేక కేసీఆర్‌ ప్రభుత్వ అండతో చెలరేగిపోయి దాడికి దిగిందా? అనే ప్రశ్నలు చాల మామూలు వాళ్లకు కలిగేలా ఈ ఘటన జరిగింది. నరేష్‌ అభిప్రాయాలేవైనా సరే... అవి ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగం. హేతుబద్ధ చర్చకు ఆస్కారం ఇవ్వదల్చుకోని వాళ్లే తరచూ మనోభావాల పేరుతో ఉన్మాద చర్యలకు పాల్పడుతుంటారు. ఇది ఫాసిస్టు లక్షణం. నరేష్‌పై దాడి వల్ల నాస్తిక, హేతువాడ, ప్రగతిశీల, విప్లవ శక్తులకు ఫాసిస్టు శక్తులు ఒక