పత్రికా ప్రకటనలు

వైద్య విద్యార్థి ప్రీతిబలవన్మరణానికి కారకులెవరు?

అసమానత, హింస, వివక్ష ఉన్న సమాజంలో జరిగే బలవన్మరణాలన్నీ సామాజిక హత్యలే. వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజ్‌ పీజీ మొదటి సంవత్సరం విద్యార్థి డాక్టర్‌ ప్రీతి ఫిబ్రవరి 22న బలవన్మరణానికి గురైంది. ఇది  మన సమాజ దుస్థితిని తెలియజేస్తోంది. స్త్రీలు  ఇంట్లో, సమాజంలో  ఆత్మగౌరవంతో జీవించడానికి  చాలా ఘర్షణ అనుభవించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఒక దశ దాటాక వారు ఆత్మహత్య వైపు నెట్టివేయబడుతున్నారు. మన సమాజం నాగరికంగా ఎదగలేదని చెప్పడానికి ప్రీతి బలవన్మరణం ఉదాహరణ.                 సమాజంలోలాగే ఉన్నత విద్యా రంగంలో  కూడా పితృస్వామ్య, ఆధిక్య భావజాలం కొనసాగే అవకాశం ఉంది. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించగల
నివాళి

ప్రముఖ కథా రచయిత భమిడిపాటి జగన్నాథరావుకు విరసం నివాళి

సీనియర్‌ కథా రచయిత భమిడిపాటి జగన్నాథరావు ఫిబ్రవరి 6న చనిపోయారు. ఆయన తెలుగు కథా చరిత్రలో గుర్తు పెట్టుకోదగిన రచయిత. మూడు తరాల కథా వికాసం ఆయనలో కనిపిస్తుంది. 1950లలో ఆయన కథా రచన ఆరంభించారు. ఆ రోజుల్లో ని చాలా మంది కథకుల్లాగే ఆయనా మధ్య తరగతి జీవిత ఇతివృత్తం ప్రధానంగా రాశారు. సహజంగానే కోస్తా ప్రాంత సాంస్కృతిక ముద్ర ఆయన కథల్లో కనిపిస్తుంది. మానవ జీవిత సంఘర్షణను, వైచిత్రిని నిశితంగా చూసి రాశారు. చాలా మామూలు కథన శైలితో సాగే ఆయన కథల్లో ఇప్పటికీ మిగిలి ఉండేది ఆయన పరిశీలనాశక్తి, అందులోని విమర్శనాత్మకత.             కొన్ని
నివాళి

ప్రొ. కందాళ శోభారాణికి విరసం నివాళి

కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు ప్రొ. కందాళ శోభారాణి ఫిబ్రవరి 12న మరణించారు. గత కొన్నేళ్లుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోనే చదివి,  తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి అక్కడే ప్రొఫెసర్‌గా  చేరారు. సుదీర్ఘ ప్రజా పోరాటాల చరిత్ర ఉన్న వరంగల్‌లో సామాజిక చైతన్యంతో మేధో రంగంలోకి వచ్చిన ఈ తరం అధ్యాపకురాలు శోభారాణి. విద్యార్థిగా, పరిశోధకురాలిగా ఉన్న రోజుల్లోనే ఆమె తన చుట్టూ జరుగుతున్న ప్రజా పోరాటాలను శ్రద్ధగా గమనించేవారు. వాటిని అభిమానిస్తూ చేయూత ఇచ్చేవారు. అనేక నిర్బంధాలు చుట్టుముట్టి ఉండే వరంగల్‌లో బుర్రా రాములు వంటి వారితో కలిసి హక్కుల ఉద్యమంలో భాగమయ్యారు.  మానవ
సంభాషణ నివేదిక

సాంస్కృతిక ప్రతివ్యూహపు కలనేత

విరసం సాహిత్య పాఠశాల నివేదిక విరసం 23వ సాహిత్య పాఠశాల జనవరి 7,8 తేదీల్లో  హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉత్తేజకరంగా జరిగింది. ఫాసిస్టు వ్యతిరేక పోరాటాల ప్రాంగణం, వాసం శివ హాలులో, నర్మద వేదికపైన రెండు రోజులు ‘ఫాసిజం ` సాంస్కృతిక ప్రతివ్యూహం’ అనే అంశంపై లోతైన చర్చ సాగింది. 7వ తేదీ శనివారం ఉదయం 11.00 గంటలకు సభా ప్రాంగణం ముందు పతాకావిష్కరణతో ప్రారంభమై ఆదివారం రాత్రి 9.00 గంటల దాకా సుమారు 16 గంటలపాటు నడిచిన సాహిత్య పాఠశాలలో వందలాది సాహిత్యాభిమానులు, సామాజిక కార్యకర్తలు, విప్లవాభిమానులు పూర్తి నిమగ్నతతో పాల్గొన్నారు.  విరసం సీనియర్‌ సభ్యులు
పత్రికా ప్రకటనలు

వీవీని తిరిగి జైలుకు పంపేందుకు ఏన్ఐఏ కుట్ర‌

విర‌సం నేత వ‌ర‌వ‌ర‌రావు భీమాకోరేగావ్ కేసులో దాఖ‌లుచేసిన అన్ని పిటిష‌న్ల‌ను బాంబే హైకోర్టు బుధ‌వారం కొట్టివేసింది. కంటి శ‌స్ర్త‌చికిత్స పూర్తిచేసుకుని మూడు నెల‌ల్లో తిరిగి జైలుకు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో అరెస్టు చేసి దాదాపు నాలుగేళ్లు అయిన ద‌ర‌మిలా శాశ్వ‌త బెయిలు కోసం పెట్టిన ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించింది. కండీష‌న్ తొల‌గించి ముంబై నుంచి హైద‌రాబాద్‌కు వెళ్లే వీలు క‌ల్పించేందుకూ నిరాక‌రించింది. ఇక మిగిలింది తాత్కాలిక  మెడిక‌ల్ బెయిల్‌. ఈ బెయిల్‌ను కూడా తీసివేసిన‌ట్టే! మూడునెల‌ల కాలానికి ఇచ్చిన తాత్కాలిక బెయిల్‌ను గ‌డువు తీర‌గానే స‌మీక్షిస్తామ‌ని త‌న తీర్పులో కోర్టు చెప్ప‌కపోవ‌డ‌మే దీనికి కార‌ణం. కాట‌రాక్ట్ చికిత్స చేయించుకుని