వ్యాసాలు

చుండూరు దళిత ప్రజా పోరాటానికి మద్దతు నీయండి

(చుండూరు మార‌ణ కాండ మీద అక్టోబ‌ర్ 1991న విప్లవ రచయితల సంఘం, జనసాహితీ సాస్కృతిక సమాఖ్య, ప్రజా రచయితల సమాఖ్య త‌ర‌పున విడుద‌ల చేసిన ఈ క‌ర‌ప‌త్రాన్ని సి. రామ్మోహ‌న్‌గారు రాశారు. ఆయ‌న స్మృతిలో పున‌ర్ముద్ర‌ణ‌) చుండూరు దళిత ప్రజా పోరాటానికి మద్దతు నీయండి భూస్వామ్య, దోపిడి, పీడన సంస్కృతులను నేలమట్టం చేయండి. గురజాడ, వీరేశలింగం పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణగారల సంఘ సంస్మరణోద్యమానికి గుంటూరు జిల్లా కేంద్రస్థానం, త్రిపురనేని హేతువాదఉద్యమం, జమీందరీ వ్యతిరేక ఉద్యమాలు, గుంటూరు జిల్లాను కదిలించివేసినవి. పన్నుల సహాయనిరాకరణ ఉద్యమం, పల్నాడు రైతాంగ తిరుగుబాటు, కన్నెగంటి హనుమంతు అమరత్వం చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకున్నవి. ఆధునిక సాహిత్యంలో
పత్రికా ప్రకటనలు

వరవరరావుకు తుమకూరు అక్రమ కేసులో అక్రమ వారెంట్‌

వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైనా గైర్హాజరీ అని రూ. 25,000 జరిమానా కర్ణాటక రాష్ట్రంలోని పావగడ అక్రమ కేసులో వరవరరావు గైర్హాజరీ అని ఆరోపిస్తూ ఆయనను అరెస్టు చేయాలని ఈ నెల 11న మధుగిరి కోర్టు  వారంట్‌ ఇచ్చి, రూ. 25 వేల జరిమానా విధించడాన్ని విరసం ఖండిస్తోంది. ఈ కేసు 2005 ఫిబ్రవరిలో నమోదైంది. ఇందులో  వరవరరావును నిందితుడిగా చేర్చారు. ఇలాంటి కేసు ఒక‌టి ఉన్న‌ట్లు భీమా కొరేగావ్‌ కేసులో అరెస్ట‌యి పూనా జెయిల్లో ఉండ‌గా 2019లో ఆయ‌న‌కు తెలిసింది. అనారోగ్య కారణాల మీద భీమా కొరేగావ్ కేసులో వ‌ర‌వ‌ర‌రావుకు బొంబాయి హైకోర్టు షరతులతో 2021 మార్చి నెలలో
పత్రికా ప్రకటనలు

విరసం మహాసభలను విజయవంతం చేసిన సాహితీ మిత్రులకు, రచయితలకు, ప్రజాసంఘాలకు, విప్లవాభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు.

అనేక నిర్బంధాలు, ఒత్తిళ్ళ మధ్య విరసం 28వ మహాసభలు నెల్లూరులో విజయవంతంగా ముగిశాయి. *సాంఘిక విముక్తి కోసం ప్ర‌త్యామ్నాయ సంస్కృతి* ల‌క్ష్యంగా సంస్కృతి - మార్క్సిజం ఇతివృత్తంగా త‌ల‌పెట్టిన ఈ మ‌హాస‌భ‌ల‌ సన్నాహాల దగ్గరి నుండి చివరి దాకా నెల్లూరు మిత్రుల సహకారం మరువలేనిది. వీళ్లంతా విర‌సం ప‌నిని త‌మ ప‌నే అనుకొని ముందుకు వ‌చ్చారు.అడిగిన వెంటనే వేదిక ఇవ్వడానికి ముందుకొచ్చిన సంఘమిత్ర స్కూల్ యాజమాన్యం అర్ధరాత్రి పోలీసుల‌ బెదిరింపులు ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది. ఏకంగా స్కూల్ గుర్తింపును రద్దు చేయిస్తామనే దాకా పోలీసులు వెళ్లారు. ఇది రాజ్య దుర్మార్గానికి పరాకాష్ట.భిన్నాభిప్రాయాలను చర్చించలేనితనం, సహించలేనితనం ఫాసిస్టు లక్షణం. గత కొన్నేళ్లుగా
సంపాదకీయం

జీతన్‌ మరాండీకి జోహార్లు

ఉరికొయ్యలను దాదాపుగా తాకిన సాంస్కృతిక విప్లవ గొంతుక, జార్ఖండ్ అభేన్‌ నాయకుడు జీతన్‌ మరాండీకి జోహార్లు. ప్రజలను చైతన్యవంతం చేస్తున్న పాటపై సుదీర్ఘ కాలం సాగిన వేట మరాండీని మానసికంగా బలహీనపరచలేకపోయింది. కానీ, ఆయన ఆరోగ్యాన్ని మాత్రం బాగా దెబ్బతీసింది. ఓ తప్పుడు హత్య కేసు నుంచి 2013లో మరాండీ బయటపడ్డారు. అరెస్టు సమయంలో చేసిన ఇంటరాగేషన్‌లో పోలీసు అధికారులు చూపించిన నరకం వల్ల జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అనారోగ్య సమస్యలు వేధించాయి. ఈ నెల 12వ తేదీన బాగా జబ్బుపడిన ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వైద్య చికిత్స అందిస్తుండగానే 13న జీతన్‌
సంపాదకీయం

కా. గొంజాలోకు జోహార్లు

పెరూ తొలితరం మావోయిస్టు, షైనింగ్‌ పాత్‌ నిర్మాత, ప్రజాయుద్ధ సంస్కృతిని లాటిన్‌ అమెరికా పోరాట ఆచ‌ర‌ణ‌లో ఎత్తిప‌ట్టిన  గొప్ప మార్క్సిస్టు-లెనినిస్టు  కామ్రేడ్‌  గొంజాలోకు విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం జోహార్లు! ప్రపంచ సోషలిస్టు విప్లవాన్ని వెలిగించిన 1980ల తరం మావోయిస్టు  మేధావి చివరి ముప్ఫై ఏళ్ల జీవితం జైలులోనే గడిచిపోయింది. పెరూలోని నావికా స్థావరంలోని ఆస్పత్రిలో 2021 సెప్టెంబరు 11వ తేదీన గొంజాలో 86 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా పార్కిన్సన్‌, చర్మ కేన్సర్‌తో ఆయన బాధపడుతున్నారు. ఈ స్థితిలో కూడా ఆయనకు వైద్య సాయాన్ని ప్రభుత్వం నిరాకరించింది. చివరకు తన భార్యతో ఇంటర్వ్యూను సైతం రద్దుచేసింది.