సాహిత్యం కవిత్వం

కాసిన్ని అక్షరాలివ్వండి

ఒక కఠోర వాస్తవం రాయాలి చెయ్యందించరూ గొప్ప కవిత రాయలి అక్షరాలు అరువివ్వరూ ఎక్కడో పొంగిన రోహింగ్యాల రోదనలు కాదు అక్కడెక్కడో తాలిబన్ల ఉన్మాదం కాదు భారతీయ తాలిబన్లు చేసే అత్యాచారానంతర పాశవిక హత్యలు,  రక్షక భటుల రక్షణలో అర్ధరాత్రి శవదహనాలు, రైతుల మీదుగా నడిపే రథాల విన్యాసాలు, అదేమని అడిగే గొంతుల్లోకి ఉపాలు, కోరెగాం కోరలు,  అబ్బసొమ్మేదో అమ్ముకున్నట్లు ప్రజల ఆస్తుల, హక్కుల అమ్మకాలు,  అన్నిటినీ నిలేసి అడగాలని వుంది  ఆవేదనకు పదాలు చాలకున్నాయి.. అక్షరాల సేద్యం చేసేవరకూ ఎవరన్నా కొన్ని తాలక్షరాలో, పొల్లక్షరాలో ఇచ్చి ఆదుకోరూ