వ్యాసాలు

శుభ్‌కరణ్  హత్యకు హర్యానా పోలీసులే కారణం 

ఫిబ్రవరి 21న పంజాబ్ - హర్యానా ఖనౌరి సరిహద్దులో హర్యానా పోలీసుల చర్యలో శుభ్‌కరణ్ మరణించాడు. ఆయన మరణం కారణంగా రైతులు ‘ఢిల్లీకి వెళ్దాం’ నిరసన ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. 22 ఏళ్ల రైతు శుభ్‌కరణ్ సింగ్ రైతు ఉద్యమ సమయంలో మరణించడంతో  పంజాబ్ లోని బటీండా జిల్లాలోని బల్లో గ్రామంలో విషాదకర వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 21 న పంజాబ్, హర్యానా సరిహద్దులోని పటియాలా జిల్లాలోని పతారాన్ పట్టణానికి సమీపంలో ఖనౌరీ సరిహద్దులో కొందరు నిరసనకారులు బారికేడ్ల వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. అందువల్ల రైతులు ‘ఢిల్లీకి వెళ్దాం’  నిరసన ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు.