నివాళి

మానవాళి *ఆనంద*మే ఆయన శ్వాస

కా. ఆనంద్‌ (దూల దాద, కటకం సుదర్శన్‌) మే 31న అమరుడయినట్టుగా జూన్‌ 4న సాయంత్రం ఆకాశవాణి వార్తలు మోసుకొచ్చాయి. ఆ వార్త ఒక పిడుగుపాటు లాగే అయింది. అది అబద్దమైతే బాగుండనే ఆరాటంతో పదే పదే రేడియో విన్నాను. విప్లవోద్యమ  అధికార ప్రతినిధి కా. అభయ్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా ఆకాశవాణి ఆ వార్త చెప్పిందనేది కొద్ది క్షణాలలోనే స్పష్టంగా తేలిపోయింది. అతనితో నాకు వున్న ఆత్మీయానుబంధం, స్నేహ బంధం, వర్గానుబంధం, తన జ్ఞాపకాలు ఒక్కసారిగా మనసంతా ముసురుకుపోయాయి. విప్లవ పయనంలో ఎప్పటికైనా తప్పక కలుస్తాడు అనే దృఢ విశ్వాసంతో వున్న నాకు ఆయన