వ్యాసాలు

ఖాకీల సంరక్షణలో కార్పొరేట్ల విస్తరణ, ప్రజా పోరాటాల ప్రతిఘటన

ప్రపంచవ్యాపితంగా ఆర్థిక ద్రవ్య సంక్షోభం ఎంత తీవ్రం అవుతుందో అంత వేగంగా వెనుకబడిన దేశాలలోకి ప్రపంచ పెట్టుబడి ప్రవహిస్తున్నది. వెనుకబడిన దేశాలలోని లోతట్టు ప్రాంతాలను వెతుక్కుంటూ మరీ దూకుడుగా అది పరుగులు తీస్తోంది. సామ్రాజ్యవాదం ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి అది బయటపడడానికి చేపడుతున్న ప్రక్రియ ఇది. కాబట్టి అసలు సంక్షోభాల గురించి 1848 లోనే కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ లు ఏం చెప్పారో మనం ఒకసారి చూద్దాం. ‘‘సంక్షోభాలను మరింత విస్తృతమైన, మరింత విధ్వంసకరమైన సంక్షోభాలకు బాట వేయడం ద్వారా, సంక్షోభ నివారణావకాశాలను తగ్గించడం  ద్వారా తాత్కాలికంగా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా, 1. ఉత్పత్తి శక్తులలో