కవిత్వం

మార్పుకై సాగిపో…

అవును రాజ్యం ఇప్పుడు బానిసత్వాన్ని కోరుకుంటుంది వర్ణ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తుంది మనుధర్మ శాస్త్రాన్ని మళ్లీ వెలికి తీస్తుంది మానవత్వాన్ని చంపుతూ మనిషిని హత్య చేస్తుంది అది కాశ్మీర్ ఫైల్స్ చూడమంటుంది కానీ గుజరాత్ ఫైల్స్ అంటే గజగజా వణుకుతూ కళ్ళెర్ర చేసి చూస్తుంది అది ఒక మతాన్ని ఒక దేవుడిని కలుపుకుపోతుంది ఈ దేశపు ముఖచిత్రంపై అది కాషాయపు జెండాను కప్పుతుంది ఒక నినాదంతో మనిషిలోని మూఢనమ్మకాన్ని బలపరుస్తుంది అది సగటు మనిషి నిత్యవసరాలను పెంచుతుంది రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతుంది దళితులు అంటే అది శూద్రులుగా చూస్తుంది వాళ్ళను హత్యలు చేయడానికి కంకణం కట్టుకుంటుంది ప్రశ్నించే