ఎగరేద్దాం జెండానిఆగస్టు 15 ఆనవాయితీ గదాఎగరెయ్యాల్సిందే!అయితే నాదో విన్నపం…ఎవరెవరికి ఏయే సమస్యలున్నాయోఅన్నిటినీ దారంగా కట్టిమరీ ఎగరేద్దాం!.కష్టాల్నీ,కన్నీళ్ళనీ,బాధల్నీ,దీనుల గాధల్నీజెండాకు కుట్టి మరీ ఎగరేద్దాం! తస్మాత్ జాగ్రత్త!జెండా ఎగరెయ్యకపోతేNIA వాళ్ళుమన ఇళ్ళ కొస్తారుఢిల్లీకి వచ్చి సంజాయిషీ ఇమ్మంటారుఎందుకొచ్చిన ఖర్మ?ఎగరేద్దాం జెండాని!75 ఏళ్ళుగాపేదల నిట్టూర్పులఉసురు పోసుకున్నజెండాని ఎగరేద్దాం! ఇంటింటిపై ఎగిరిన జెండాలుఆగస్టు 15 తర్వాతవీథుల్లో,చెత్త కుప్పల్లోపడి దొర్లాడుతుంటేపాపం పింగళి వెంకయ్యఎక్కడున్నాడో!ఆయన ఆత్మకుశాంతి కలగాలనిలేని దేవుణ్ణి ప్రార్థిద్దాం!47 లో డాలర్ కునాలుగు రూపాయలేఈనాటికి80 రూపాయలయ్యాయనిచంక లెగరేసుకొనిఎగరేద్దాం జెండాని!దేశంలో ఎన్ని సవాళ్ళు!ఎన్ని ఉరితాళ్ళు!నోళ్ళు తెరుచుకొంటున్నఎన్నెన్ని జైళ్ళు!అన్నిటినీ గానం చేస్తూఎగరేద్దాం జెండాని!ఎగిరే జెండాని చూసిప్రజా స్వామ్యంవిరగబడి నవ్వకముందేమత్తు వదిలినిద్ర లేవకముందేఎగరేద్దాం జెండాని!