కవిత్వం

ఎగరేద్దాం జెండాని

ఎగరేద్దాం జెండానిఆగస్టు 15 ఆనవాయితీ గదాఎగరెయ్యాల్సిందే!అయితే‌ నాదో విన్నపం…ఎవరెవరికి ఏయే సమస్యలున్నాయోఅన్నిటినీ దారంగా కట్టిమరీ ఎగరేద్దాం!.కష్టాల్నీ,కన్నీళ్ళనీ,బాధల్నీ,దీనుల గాధల్నీజెండాకు కుట్టి మరీ ఎగరేద్దాం! తస్మాత్ జాగ్రత్త!జెండా ఎగరెయ్యకపోతేNIA వాళ్ళుమన ఇళ్ళ కొస్తారుఢిల్లీకి వచ్చి సంజాయిషీ ఇమ్మంటారుఎందుకొచ్చిన ఖర్మ?ఎగరేద్దాం జెండాని!75 ఏళ్ళుగాపేదల నిట్టూర్పులఉసురు పోసుకున్నజెండాని ఎగరేద్దాం! ఇంటింటిపై ఎగిరిన జెండాలుఆగస్టు 15 తర్వాతవీథుల్లో,చెత్త కుప్పల్లోపడి దొర్లాడుతుంటేపాపం పింగళి వెంకయ్యఎక్కడున్నాడో!ఆయన ఆత్మకుశాంతి కలగాలనిలేని దేవుణ్ణి ప్రార్థిద్దాం!47 లో డాలర్ కునాలుగు రూపాయలేఈనాటికి80 రూపాయలయ్యాయనిచంక లెగరేసుకొనిఎగరేద్దాం జెండాని!దేశంలో ఎన్ని సవాళ్ళు!ఎన్ని ఉరితాళ్ళు!నోళ్ళు తెరుచుకొంటున్నఎన్నెన్ని జైళ్ళు!అన్నిటినీ గానం చేస్తూఎగరేద్దాం జెండాని!ఎగిరే జెండాని చూసిప్రజా స్వామ్యంవిరగబడి నవ్వకముందేమత్తు వదిలినిద్ర లేవకముందేఎగరేద్దాం జెండాని!
సాహిత్యం వ్యాసాలు

వర్గకసిని సిరా చేసుకున్న కో.ప్ర

విప్లవోద్యమ ప్రభావంతో 1980, 90లలో కవిత్వం రాసిన అప్పటి యువకవుల్లో కో.ప్ర. తనదైన ప్రత్యేక ముద్రతోవిలక్షణంగా కనిపించాడు. వచన కవితనూ, పాటనూ - రెండిటినీ అవలీలగా నడిపించగల నైపుణ్యం అతనిది. కవిగాఅతని మాటకు శక్తి వుంది. అతని భావంలో ఆర్తి ఉంది. అతని ఆవేదనలో చిత్తశుద్ధి వుంది. అంతకంటే ముఖ్యంగా అతనిఅవగాహనలో వర్గకసి వుంది. వీటన్నిటితో బాటు అతని కవిత్వంలో సూటిదనం, పోటుదనం వున్నాయి.కవిగా కో.ప్ర గా సాహిత్యలోకానికి పరిచయమైన అతని పూర్తిపేరు కోలపూడి ప్రసాద్. అతని వూరు నెల్లూరు జిల్లావెంకటగిరి సమీపంలోని డక్కిలి గ్రామం. 1966 జూన్ 2వ తేదీన పుట్టాడు. 1994 అక్టోబర్ 23న శ్రీకాకుళం