వ్యాసాలు సమీక్షలు

జీవితం మలచిన కవి

'పూలపరిమళం'లో కోడం కుమారస్వామి రాసిన ఇరవయ్యేళ్ల (2000-20) నలభై ఎనిమిది కవితలు ఉన్నాయి. కాలంగా రెండు దశాబ్దాలు దీర్ఘకాలమే. ఇంకో కొత్త తరానికి ఆహ్వానం పలికి చోటిచ్చే కాలం. ఆయన సంవత్సరానికి రెండు మూడు కవితలకు మించి రాసినట్లు లేదు. అందులోనూ 2004 నుంచి 2007 దాకా రాసినట్లు లేదు. 2014 నుంచి కొంచెం ఎక్కువగా రాస్తున్నాడు. ఆయన జీవితం చాల మాగిన సారవంతమైన మట్టి బతుకు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికిన కోట్లాది కష్టజీవుల్లో అతను ఒకడు. ఈ అన్ని రుతువుల్లోనూ, అన్ని అననుకూలతలలోనూ, ఆహారాన్వేషణలో దానినే మనం బతుకు తెరువు అంటున్నాం. ఆయన